TELUGU JYOTHI
Newspaper Banner
Date of Publish : 07 June 2026, 4:06 pm Posted by : TELUGU JYOTHI DESK

అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన. మియాపూర్‌లో ఏర్పాటు చేస్తున్న సభా ప్రాంగణాన్ని పరిశీలించిన జైపాల్. సభా ఏర్పాట్లు, భద్రతా చర్యలపై అధికారులకు సూచనలు.

  • శేర్లింగంపల్లి అభివృద్ధి పనులకు సుమారు రూ.2,000 కోట్ల నిధులు.
  • అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన.
  • మియాపూర్‌లో ఏర్పాటు చేస్తున్న సభా ప్రాంగణాన్ని పరిశీలించిన జైపాల్.
  • సభా ఏర్పాట్లు, భద్రతా చర్యలపై అధికారులకు సూచనలు.
  • శేర్లింగంపల్లి అభివృద్ధి పనుల సభా ఏర్పాట్లను పరిశీలించిన ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జైపాల్
  • శేర్లింగంపల్లి అభివృద్ధి పనుల సభా ఏర్పాట్లను పరిశీలించిన ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జైపాల
  • తెలుగుజ్యోతి, మియాపూర్ జూన్ 7: శేర్లింగంపల్లి నియోజకవర్గంలో సుమారు రూ.2,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మియాపూర్‌కు విచ్చేయనున్న నేపథ్యంలో ఏర్పాటు చేస్తున్న సభా ప్రాంగణాన్ని తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జెరిపేటి జైపాల్ పరిశీలించారు.

ఈ సందర్భంగా సభా ఏర్పాట్లు, వేదిక నిర్మాణం, ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం అయ్యేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శేర్లింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ఈ కార్యక్రమం కీలకమని ఆయన పేర్కొన్నారు.