అమీన్‌పూర్‌లో ఘనంగా ఫలహారం బండి ఊరేగింపు రత్నాల పవన్ కిట్టు ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహణ
చిన్ననాటి దోస్తుల భారీ సందడి.. కనుల పండువగా సాగిన వేడుకలు అమీన్‌పూర్, ఆగస్టు 11: తెలుగు జ్యోతి రిపోర్టర్ మన్నె ప్రసాద్ అమీన్‌పూర్ డివిజన్ పరిధిలో ఫలహారం బండి ఉత్సవం భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా జరిగింది. రత్నాల పవన్ కిట్టు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు స్థానికులు, భక్తులు, మహిళలు, యువత, చిన్ననాటి స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సవాన్ని విజయవంతం చేశారు. సంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన పూజలు, ప్రత్యేక కార్యక్రమాలతో పరిసర ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఉత్సవంలో భాగంగా ఫలహారం బండిని...