ఎమ్మెల్యే రవికుమార్ చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం.
టీడీపీ మహిళా నాయకులు ఎన్ని శ్రీదేవి తెలుగు జ్యోతి న్యూస్ ఆమదాలవలస నియోజకవర్గం ఆగస్టు 18: సోమవారం పారిశ్రామికవాడలోని ఎమ్మెల్యే కార్యాలయంలో టీడీపీ మహిళా నాయకులు, మున్సిపల్ ఉద్యోగులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ మహిళా నాయకులు ఎన్ని శ్రీదేవి మాట్లాడుతూ 2014-19 మధ్య టీడీపీ పాలనతో పాటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే రవికుమార్ మున్సిపల్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. 2014 నుంచి ఇప్పటివరకు మున్సిపాలిటీలోని 23 వార్డుల్లో విద్యుత్ స్తంభాలు వీధిలైట్లు ఏర్పాటు చేయడం...