వందమందికి పరీక్షలు & ఉచితంగా మందులు పంపిణీ
తెలుగు జ్యోతి న్యూస్ ఆమదాలవలస నియోజకవర్గం:20 జూన్ :

ఆమదాలవలస మండలం కొర్లకోట గ్రామంలో శ్రీ సాయి డెంటల్ కాలేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొర్లకోట గ్రామ ప్రజలు సుమారు వందమంది రోగులకు ఉచితంగా దంత వైద్య సేవలు అందించారు. అలాగే బాధితులకు అవసరమైన మందులు ఉచితంగా అందజేశారు. వైద్య సిబ్బంది మాట్లాడుతూ మానవునికి సోకే అన్ని రోగాలకు కారణం దంతాలు కాబట్టి దంతాలను రక్షించుకుంటే అన్ని అవయవాలు రక్షించుకోవచ్చు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో దంత వైద్య సిబ్బంది పాల్గొన్నారు.