TELUGU JYOTHI
Newspaper Banner
Date of Publish : 10 August 2026, 10:20 am Posted by : TELUGU JYOTHI DESK

ఘనంగా కోట మైసమ్మకు బోనాలు

  • అమ్మవారి దయతో పట్టణ ప్రజలుసుభిక్షంగా ఉండాలి.
  • నిష్టతో బోనం ఎక్కించిన భక్తులు
  • ఆలయ నిర్మాణ దాత,చైర్మన్ గూడూరు పెంటయ్య గౌడ్

నాగారం,ఆగస్టు 9(తెలుగుజ్యోతి ) తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పవిత్రమైన బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని కోట మైసమ్మ ఆలయ నిర్మాణ దాత ఆలయ చైర్మన్ గూడూరు పెట్టే గౌడ్ అన్నారు.నాగారం డివిజన్ ఓల్డ్ విలేజ్ పరిధిలోని శ్రీకోట మైసమ్మ ఆలయం భక్తుల బోనాలతో కిటకిటలాడింది.భక్తులు శివసత్తుల మధ్య నిష్టతో అమ్మవారికి బోనం నైవేద్యంగా ఎక్కించి మొక్కులు తీర్చుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గూడూరు పెంటయ్య గౌడ్ మాట్లాడుతూ శ్రీకోట మైసమ్మ కటాక్షంతో పట్టణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మాధవకృష్ణ శర్మ,ఆలయ కమిటీ సభ్యులు గూడూరు కృష్ణగౌడ్,గూడూరు అశోక్ గౌడ్,గూడూరు ప్రభాకర్ గౌడ్,గూడూరు శ్రీనివాస్ గౌడ్,గూడూరు ఆంజనేయులు గౌడ్,గూడూరు చక్రపాణి గౌడ్,గూడూరు రమేష్ గౌడ్,గూడూరు మహేష్ గౌడ్,గూడూరు సతీష్ గౌడ్,గూడూరు అవినాష్ గౌడ్,గూడూరు నితీష్ గౌడ్,గూడూరు అభిరామ్ గౌడ్,రాంపల్లి సంపత్ గౌడ్,తలారి సరోజన, తలారి సుశీల,గూడూరు కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.