TELUGU JYOTHI
Newspaper Banner
Date of Publish : 09 July 2026, 11:34 am Posted by : TELUGU JYOTHI DESK

ఘనంగా మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలు

ఘనంగా మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలు

నిజాంపేట్ తెలుగు జ్యోతిప్రతినిధి జూలై 8

నిజాంపేట సర్కిల్ ప్రగతి నగర్ ఏనుగుల బొమ్మ చౌరస్తా దగ్గర ఉన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం దగ్గర వైయస్సార్ అభిమాని వైయస్ (వెంకటేశ్వర్లు) ఆధ్వర్యంలో ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజాంపేట్ మాజీ డిప్యూటీ మేయర్ శనగల ధనరాజ్ యాదవ్, నిజాంపేట సర్కిల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రంగనాయప్రసాద్, మాజీ కార్పొరేటర్లు ఉట్కూరు సురేష్ రెడ్డి, బాలాజీ నాయక్ పాల్గొని వైయస్సార్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ వైయస్సార్ భౌతికంగా లేకపోయినప్పటికీ ప్రజల గుండెల్లో వారు స్థిరస్థాయిగా ఉంటారన్నారు. పేద ప్రజల కోసం నిరంతరం తపన పడే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది వైయస్సార్ కే దక్కుతుందన్నారు ముఖ్యంగా పేద ప్రజల కోసం ఉచిత ఆరోగ్యశ్రీ ,పేద విద్యార్థులు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్, ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని ఉద్దేశంతో గృహాలు అందించారని, ప్రతి ఎకరా నీరు తడవడానికి జలయజ్ఞం కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే వారు చేసిన సేవలు ఇంకా ఎన్నో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏ రవి ప్రసాద్, ఎం వెంకట్రావు, కే జార్జ్, ఎస్ వెంకటేశ్వర్లు , శ్రీకర్ గుప్తా, దశరథ్ ,స్వామి ,కే హరిబాబు, బుజ్జి, వెంకయ్య, అంజిరెడ్డి, రవీందర్, లక్ష్మారావు, మహబూబ్, ఏడుకొండలు, ఇషాక్ ,శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు