TELUGU JYOTHI
Newspaper Banner
Date of Publish : 05 July 2026, 2:53 pm Posted by : TELUGU JYOTHI DESK

*చెట్లను నాటుదాం ప్రకృతిని కాపాడుకుందాం*

శ్రీనిధి స్కూల్ ఆప్ ఎక్సలెన్స్ పాఠశాల ఆధ్వర్యంలో పర్యావరణ వేడుకలు

*తెలుగుజ్యోతి కొండాపూర్ :05 జులై :*

కొండాపూర్ శ్రీరామ నగర్ బి బ్లాక్ లోని శ్రీనిధి స్కూల్ అఫ్ ఎక్సలెన్స్ పాఠశాలలో శనివారం రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణం పై పర్యావరణ అవగాహన కలుగజేయుటకు పిల్లల చేత ర్యాలీ నిర్వహించారు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు చెట్లను మొక్కలను తీసుకొచ్చారు. ఫ్లక్ కార్డ్ చేత పట్టుకుని పర్యావరణాన్ని కాపాడాలని చెట్లు పెంచడం వలన హైదరాబాద్ మహానగరంలో బైకులు కార్ల వల్ల గాలి కలుషితం అయిపోయి ప్రజలు రోగాల బారిన పడతారని అందుకు చెట్లు బాగా ఉపయోగపడతాయని చెడుగాలని తీసుకొని మంచి గాలిని చెట్లు అందిస్తాయని ప్రిన్సిపాల్ సుధా అన్నారు . బొటానికల్ గార్డెన్ వరకు రాలి నిర్వహించి అవగాహన కల్పించారు. స్కూల్ ప్రిన్సిపాల్ సుధా మాట్లాడుతూ. కాలుష్యం వలన ఎన్నో అనర్ధాలు జరుగుతున్నాయి ఆరోగ్యం సమస్యలతో అందరూ బాధపడుతున్నారు.

పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ చెట్లను నాటి వాటిని సంరక్షించుకోవాలని దాని ద్వారా అడవులను కాపాడుకోవచ్చని చెత్తను సరైన పద్ధతిలో కాలని ప్లాస్టిక్ వాడకం తగ్గించుకోవాలని చెప్పారు.

చెట్లను నాటుదాం ప్రకృతిని కాపాడుకుందాం

సేవ్ నేచర్ సేవ్ ఫ్యూచర్ అని తెలుగు హిందీ ఆంగ్లం భాషలలో నినాదాలు చెప్పించారు. పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు,