జూలై 10న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపు
విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం AIFDS ఆందోళన తెలుగుజ్యోతి , బ్యూరో: 08 జులై : తెలంగాణలో విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని AIFDS గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి ముత్తనగారి శ్రీకాంత్ ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది కొరత, మౌలిక వసతుల లేమి, హాస్టళ్లలో దయనీయ పరిస్థితులు, స్కాలర్‌షిప్-ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీ, విద్యార్థుల భద్రత వంటి సమస్యలు పేరుకుపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్...