ఫీజుల నియంత్రణ చట్టం అమలు కోరుతూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముట్టడి

ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజులపై ఆగ్రహం   ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ తెలుగుజ్యోతి వికారాబాద్ :09 జూన్ హైదరాబాద్‌లోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ కార్యాలయాన్ని తెలంగాణ రక్షణ సేన నాయకులు ముట్టడించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపిస్తూ, వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. నాయకులు మాట్లాడుతూ, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలపై ప్రైవేట్ పాఠశాలల ఫీజుల భారం రోజురోజుకూ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని...