TELUGU JYOTHI
Newspaper Banner
Date of Publish : 09 July 2026, 8:44 am Posted by : TELUGU JYOTHI DESK

మాజీ సి ఎం వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా మెడికల్ క్యాంపు మందుల పంపిణీ

మాజీ సి ఎం వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా మెడికల్ క్యాంపు మందుల పంపిణీ

తెలుగుజ్యోతి, శేరిలింగంపల్లి జులై 9:

శేరిలింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ డివిజన్ లో సురేష్ నాయక్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల సందర్భంగా సి ఎం ఆర్ హాస్పిటల్, బిగ్ టీవీ సౌజన్యంతో కార్యక్రమంలో బాగంగా ఆరోగ్య శిబిరం, మందుల పంపిణీ , కేక్ కటింగ్, అనంతరం అన్న దాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ , టి పి సి సి ప్రధాన కార్యదర్శి వి. జగదీశ్వర్ గౌడ్ , ఎం బి సి కార్పొరేషన్ చైర్మన్ జెరిపెటి జైపాల్ , యాదవ కార్పొరేషన్ చైర్మన్ ఎం. రఘునాథ్ యాదవ్, ట్రైక ర్ చైర్మన్ బెల్లయ్య నాయక్ , శేరిలింగంపల్లి కోఆర్డినేటర్ రఘునందన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే నియోజక వర్గం కి చెందిన పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రసంగిస్తూ ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పథకాలను స్మరించుకుంటూనే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రస్తుత పథకాలను ప్రశంసించారు. అలాగే, కాంగ్రెస్ పార్టీలో సురేష్ నాయక్ పనితీరును అనుసరించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సమాజ శ్రేయస్సు కోసం ఆరోగ్య శిబిరం, ఉచిత మందుల పంపిణీ, అన్నదానం వంటి కార్యక్రమాలు చేపట్టి, తన సోదరుడి సేవా స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తున్న నాగేశ్ ను సభికులు అభినందించారు.