TELUGU JYOTHI
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 11:37 am Posted by : TELUGU JYOTHI DESK

లోవోల్టేజీ సమస్యకు పరిష్కారం నాగసముందర్‌లో ‘ప్రజా బాటలో విద్యుత్ అధికారులు’ కార్యక్రమం.

తెలుగుజ్యోతి వికారాబాద్ బ్యూరో ఆగస్టు 14:

మండల పరిధిలోని నాగసముందర్‌ గ్రామంలో గురువారం ‘ప్రజా బాటలో విద్యుత్ అధికారులు’ కార్యక్రమాన్ని నిర్వహించారు.మండల విద్యుత్ శాఖ ఏఈ వేణుగోపాల్‌రెడ్డి,లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మణ్‌,గ్రామ సర్పంచ్‌ వెంకటేశ్వర్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.గ్రామంలో గతంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను అధికారులు పరిశీలించారు.ప్రధానంగా లోవోల్టేజీ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మూడు 25 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లను నూతనంగా ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను మెరుగుపరిచారు.అలాగే గ్రామ సర్పంచ్‌ వెంకటేశ్వర్‌ వినతిమేరకు మిషన్‌ భగీరథ ట్యాంకు వద్ద ఏర్పాటు చేసిన బోర్‌కు త్రీఫేజ్‌ విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చారు.దీంతో మిషన్‌ భగీరథ నీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా విద్యుత్‌ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.గ్రామంలో చాలాకాలంగా ఉన్న లోవోల్టేజీ సమస్యకు కూడా అధికారులు పరిష్కారం చూపారు.విద్యుత్‌ శాఖ అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.అధికారుల పనితీరు బాగుందని అభినందించారు. కార్యక్రమంలో లైన్మెన్‌ వెంకటరాములు,సిబ్బంది వెంకట్‌,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.