TELUGU JYOTHI
Newspaper Banner
Date of Publish : 11 July 2026, 5:38 pm Posted by : TELUGU JYOTHI DESK

వెటర్నరీ సేవలలోకి ‘పెట్ ఫోక్’ అడుగు

హైదరాబాద్‌లో కొత్త క్లినిక్స్ ప్రారంభం 

పెంపుడు జంతువులకు సమగ్ర హెల్త్‌కేర్ సేవలు

తెలుగు జ్యోతి బ్యూరో :11 జులై :

పెట్‌కేర్ రంగంలో వేగంగా ఎదుగుతున్న ‘పెట్ ఫోక్’ సంస్థ ఇప్పుడు వెటర్నరీ హెల్త్‌కేర్ సేవల్లోకి ప్రవేశించింది. ఈ మేరకు కంపెనీ ప్రత్యేకంగా “వెటర్నరీ డివిజన్”ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

హైదరాబాద్ కాంపల్లిలో త్వరలో వెటర్నరీ సేవలను ప్రారంభించనున్న సంస్థ, బంజార హిల్స్‌లో “వెటర్నరీ పాడ్”ను కూడా కొద్ది రోజుల్లో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కొత్త సేవల ద్వారా పెంపుడు జంతువులకు అవసరమైన సమగ్ర వైద్య సేవలను అందించనున్నారు.

ఈ డివిజన్ ద్వారా డాక్టర్ కన్సల్టేషన్, వ్యాక్సినేషన్, ప్రివెంటివ్ హెల్త్‌కేర్, వెల్నెస్ చెకప్‌లు, మెడికల్ గైడెన్స్ వంటి సేవలు అందుబాటులో ఉంటాయి. అదనంగా హెల్త్ క్యాంపులు, అవగాహన కార్యక్రమాలు, టెలికన్సల్టేషన్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా 100కు పైగా ‘పెట్ ఫోక్’ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఎక్స్‌పీరియన్స్ స్టోర్లు, గ్రూమింగ్ సెంటర్లు, మొబైల్ గ్రూమింగ్ సేవలతో ముందంజలో ఉన్న సంస్థ, వెటర్నరీ సేవలను జోడించడం ద్వారా పెంపుడు జంతువులకు సంపూర్ణ సంరక్షణ అందించాలని భావిస్తోంది.

ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ లక్ష్మీకాంత్ పుదుచెర్రి మాట్లాడుతూ, “ఇది మా ప్రయాణంలో కీలక మైలురాయి. పెట్ పేరెంట్స్ మరియు వారి పెంపుడు జంతువులకు ప్రతి దశలో తోడుగా ఉండే ఎకోసిస్టమ్‌ను నిర్మిస్తున్నాం” అని తెలిపారు.

కంపెనీ ప్రతినిధి దీపేష్ వీర మాట్లాడుతూ, “నాణ్యమైన, అందుబాటులో ఉండే వెటర్నరీ కేర్‌పై మా దృష్టి ఉంది. ముఖ్యంగా ప్రివెంటివ్ కేర్‌కు ప్రాధాన్యం ఇస్తాం” అని చెప్పారు.

గ్రూమింగ్ నుంచి చికిత్స వరకు అన్ని సేవలు ఒకే చోట అందుబాటులోకి రావడంతో హైదరాబాద్‌లోని పెట్ లవర్స్‌కు ఇది సంతోషకరమైన వార్తగా మారింది.