TELUGU JYOTHI
Newspaper Banner
Date of Publish : 09 July 2026, 8:51 am Posted by : TELUGU JYOTHI DESK

శేరిలింగంపల్లిలో ఘనంగా డాక్టర్ వై.ఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు..  

పాల్గొన్న జగదీశ్వర్ గౌడ్, యలమంచి ఉదయ్ కిరణ్.

తెలుగుజ్యోతి, శేరిలింగంపల్లి జులై 9:

డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా మియాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద యూత్ కాంగ్రెస్ నాయకుడు రంగా రెడ్డి జిల్లా యూత్ కాంగ్రేస్ కార్యదర్శి మన్నే నరేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల కార్యక్రమంతో పాటు అయ్యప్ప సొసైటీలో సురేష్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు నగేష్ నాయక్

ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ క్యాంపు, అన్నదాన కార్యక్రమంలో వి. జగదీశ్వర్ గౌడ్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జెరిపేటి జైపాల్ , తెలంగాణ రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ మారబోయిన రఘునాథ్ యాదవ్ , ట్రై కార్ చైర్మెన్ బెల్లయ్య నాయక్, కాంగ్రెస్ నాయకుడు యలమంచి ఉదయ్ కిరణ్, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, కళాశాల విద్యార్థులు మరియు ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విద్య, వైద్యం, వ్యవసాయం, రైతు సంక్షేమం, పేదల అభ్యున్నతి వంటి రంగాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఏ విద్యార్థి భవిష్యత్తుకు అడ్డంకి కాకూడదనే సంకల్పంతో ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించే అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని తెలిపారు. విద్య ద్వారా వ్యక్తి జీవితమే కాకుండా కుటుంబం, సమాజం, రాష్ట్ర భవిష్యత్తు కూడా మారుతుందనే విశ్వాసంతో ఆయన పాలన సాగిందని అన్నారు.ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు గ్రామాల్లో పర్యటిస్తూ వారి కష్టసుఖాల్లో భాగస్వామి కావడం వైఎస్ఆర్ నాయకత్వంలోని విశిష్ట లక్షణమని అన్నారు. సంక్షేమ పథకాల ద్వారా లక్షలాది కుటుంబాల్లో ఆశలు నింపి, ప్రభుత్వం ప్రజల గడపకు చేరాలనే ఆలోచనను కార్యరూపంలో చూపించిన దూరదృష్టి గల నాయకుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు.ఈ కార్యక్రమాల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గ కోఆర్డినేటర్ రఘునందన్ రెడ్డి, కృష్ణ, మన్నేపల్లి సాంబశివరావు, కట్ల శేఖర్ రెడ్డి, మహిపాల్ యాదవ్, మోహన్ సింగ్, గోపాల్ నాయక్, మిరియాల ప్రీతం, శ్రీమతి ప్రసన్న సురేష్ నాయక్, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీహరి, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సౌందర్య రాజన్, రాంచందర్ గౌడ్, రవికుమార్, శేరిలింగంపల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జాకీర్, రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆసిఫ్ పటేల్, సాయి కిషోర్, రామస్వామి, సురేష్, బ్రహ్మయ్య యాదవ్, ముక్తార్, యాద గౌడ్, హరి కిషన్, సాజిద్, డాక్టర్ ప్రసాద్, శ్యామ్ నాయక్, ప్రేమ్ యాదవ్, సర్దార్, మహిళా కాంగ్రెస్ నాయకులు అనిత, జయ, మణేమ్మ తదితరులు పాల్గొన్నారు.