TELUGU JYOTHI
Newspaper Banner
Date of Publish : 11 June 2026, 8:41 am Posted by : TELUGU JYOTHI DESK

5.20 కోట్ల రూపాయలతో నిర్మించిన పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన “ఎమ్మెల్యే


5.20 కోట్ల రూపాయలతో నిర్మించిన పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన “ఎమ్మెల్యే

జిల్లా నారాయణపురం ప్రాజెక్ట్ చైర్మన్ సనపల డిల్లేశ్వరరావు

ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపిన కొర్లకోట గ్రామ ప్రజలు

తెలుగు జ్యోతి న్యూస్ ఆమదాలవలస నియోజకవర్గం : 10 జూన్

[td_smart_list_end]

ఆమదాలవలస మండలంలోని కొర్లకోట గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమదాలవలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్ ఘనంగా ప్రారంభించారు. గ్రామ ప్రజల సౌకర్యార్థం రూ.1.70 కోట్ల వ్యయంతో నిర్మించిన 11 సీసీ రోడ్లు, కాలువలను ప్రారంభించడంతో పాటు 3.8 కోట్లు రూపాయలతో కొర్లకోట నుండి కలివరం వరకు నూతనంగా నిర్మించిన బీటీ రహదారిని కూడా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. గ్రామాల్లో మెరుగైన రహదారులు, పారిశుద్ధ్య సౌకర్యాలు, తాగునీటి వసతులు కల్పించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆయన అన్నారు.కొర్లకోట గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్లు మరియు కాలువల వల్ల వర్షాకాలంలో నీరు నిల్వ ఉండే సమస్యలు తగ్గడంతో పాటు ప్రజల రాకపోకలు మరింత సులభతరం అవుతాయని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే కొర్లకోట–కలివరం బీటీ రహదారి నిర్మాణంతో రెండు గ్రామాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడి రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు సులభంగా తరలించుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.అనంతరం రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలలో భాగంగా గ్రామ రైతులకు రాయితీ ధరలపై వరి విత్తనాలను పంపిణీ చేశారు. రైతులు నాణ్యమైన విత్తనాలను వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే, వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతుల అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వ్యవసాయానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విత్తనాలు, సాగునీటి వనరుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ప్రజలు తమపై ఉంచిన విశ్వాసానికి అనుగుణంగా ఆమదాలవలస నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని కూన రవికుమార్ స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, వ్యవసాయ రంగ బలోపేతం, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమ గ్రామానికి ఎంతో అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే కి గ్రామ ప్రజలు వర్షం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కూటమి ముఖ్య నాయకులు , ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.