TELUGU JYOTHI
Newspaper Banner
Date of Publish : 15 September 2026, 3:30 pm Posted by : TELUGU JYOTHI DESK

మీర్‌పేట్ మున్సిపాలిటీలో విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వినాయ

తెలుగుజ్యోతి
మహేశ్వరం

మహేశ్వరం నియోజకవర్గం మీర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో గణనాథుని తొలి రోజు పూజా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో గణపతిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మీర్‌పేట్ విశ్వకర్మ సంఘం అధ్యక్షులు ప్రభాకర చారితో పాటు సంఘం సభ్యులందరూ పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు గణనాథుని సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు ప్రభాకర చారి మాట్లాడుతూ.. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో సంఘ సభ్యులు, వారి కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. గణేష్ ఉత్సవాలను సంఘ సభ్యులందరి సహకారంతో ఐకమత్యంగా, భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.