కొంపల్లిలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు.. ఈటల రాజేందర్‌కు ఘన స్వాగతం
తెలుగు జ్యోతి న్యూస్ కొంపల్లి: అక్టోబర్ 2:

మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని కొంపల్లి డివిజన్‌లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ డివిజన్ అధ్యక్షుడు సతీష్ సాగర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం పారిశుద్ధ్య కార్మికులను శాలువాలతో సత్కరించి, వారి సేవలను అభినందించారు. సమాజ ఆరోగ్యం, పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు ప్రశంసనీయమని నాయకులు పేర్కొన్నారు.
తదుపరి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఈటల రాజేందర్ పాల్గొని పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. గాంధీజీ చూపిన పరిశుభ్రత, సేవాభావం, సామాజిక బాధ్యతను ప్రతి ఒక్కరూ ఆచరించాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మూగ జైశ్రీ, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు గిరివర్ధన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు మల్లారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ఆదిరెడ్డి రాజిరెడ్డి, జిల్లా ఓబీసీ మోర్చా నాయకుడు శేఖర్ యాదవ్, జిల్లా నాయకులు శివాజీ రాజు, శంకర్ నాయక్, కొంపల్లి బీజేవైఎం అధ్యక్షుడు మహేందర్ సాగర్, స్థానిక నాయకులు మాధురి, మధు, మహేశ్వర్ రెడ్డి, ఆకుల శ్రీనివాస్, తిరుపతి, దేవిక, లక్ష్మణ్, సందీప్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.