తెలుగు జ్యోతి న్యూస్ ఆమదాలవలస నియోజకవర్గం:
ఆమదాలవలస మున్సిపాలిటీ కృష్ణాపురంలో గురువారం నాడు వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించి భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో చుట్టుపక్క ఉన్న గ్రామ ప్రజలు అందరూ మండపంలో స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. పరిసర గ్రామాల నుంచి వందలాది మందికి పైగా భక్తులు తరలివచ్చి పాల్గొని స్వామి వారిని దర్శించుకుని, అన్న,తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అన్నప్రసాద దాత కుటుంబ, సభ్యులు గ్రామ పెద్దలు, యవత, గణేష్ ఉత్సవ నిర్వాహక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.