TELUGU JYOTHI
Newspaper Banner
Date of Publish : 04 September 2026, 10:43 am Posted by : TELUGU JYOTHI DESK

ఘనంగా మీడియా మిత్రుల మధ్య ఇమ్మానియేల్ కంప్యూటర్స్ అధినేత “విజయ్ కుమార్” జన్మదిన వేడుకలు

శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన “విజయ్ ”

తెలుగు జ్యోతి న్యూస్ ఆమదాలవలస నియోజకవర్గం :

 

ఆమదాలవలస పట్టణంలోని ఇమ్మానియేల్ కంప్యూటర్స్ సంస్థ అధినేత పొన్నాడ విజయ్ కుమార్ జన్మదిన వేడుకలు గురువారం స్నేహితుల మధ్య ఘనంగా నిర్వహించారు.సన్నిహితులు విజయ్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనతో కేక్ కట్ చేయించి వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ.. తన జన్మదినాన్ని పురస్కరించుకుని నేరుగా, చరవాణి ద్వారా, వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. స్నేహితుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
స్నేహితులు, సన్నిహితుల ప్రేమాభిమానాలు, ఆత్మీయత తనకు ఎల్లప్పుడూ ప్రత్యేకమని విజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు స్నేహితులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.