కుత్బుల్లాపూర్‌లో జర్నలిస్టుల నిరసన క్యాష్‌లెస్ హెల్త్ కార్డులు అమలు చేయాలని డిమాండ్

  కుత్బుల్లాపూర్, అక్టోబర్ 2 (తెలుగు జ్యోతి న్యూస్): జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ముఖ్యంగా జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా క్యాష్‌లెస్ హెల్త్ కార్డుల సౌకర్యాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టియుడబ్ల్యూజే (టీయూజే) హెచ్-143 యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం కుత్బుల్లాపూర్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. షాపూర్ నగర్‌లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జర్నలిస్టులు, అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం షాపూర్ నగర్ ప్రధాన పోస్టాఫీస్ కార్యాలయం వద్ద పోస్ట్‌కార్డుల...