క్యాన్సర్ రోగుల కోసం స్టార్ హాస్పిటల్స్‌లో ప్రత్యేక నొప్పి నివారణ–సహాయక సంరక్షణ సేవలు ప్రారంభం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ప్రారంభోత్సవం క్యాన్సర్ సేవల్లో విశేష కృషి చేసిన వైద్యులు, దాతలకు ఘన సన్మానం హైదరాబాద్‌లో ఈ తరహా సమగ్ర సేవలు అందిస్తున్న తొలి ప్రైవేట్ ఆసుపత్రిగా స్టార్ హాస్పిటల్స్ ,

తెలుగుజ్యోతి, హైదరాబాద్ జులై 23 నానక్‌రామ్‌గూడలోని స్టార్ క్యాన్సర్ సెంటర్‌లో క్యాన్సర్ రోగుల కోసం ప్రత్యేక నొప్పి నివారణ–సహాయక సంరక్షణ సేవలు ప్రారంభమయ్యాయి. భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఈ సేవలను ప్రారంభించారు. సమగ్ర క్యాన్సర్ చికిత్సతో పాటు ప్రత్యేక నొప్పి నివారణ, సహాయక సంరక్షణ సేవలను నేరుగా అందిస్తున్న హైదరాబాద్‌లోని తొలి ప్రైవేట్ ఆసుపత్రిగా స్టార్ హాస్పిటల్స్ నిలిచిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టార్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ గోపీచంద్ మన్నం, డాక్టర్ రమేష్ గూడపాటి, మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి...