TELUGU JYOTHI
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 6:50 am Posted by : TELUGU JYOTHI DESK

గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్.

 

తెలుగు జ్యోతి జాతీయ దినపత్రిక 29 జూలై సంగారెడ్డి ప్రతినిధి:

సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి పట్టణంలో 9 వ వార్డులో గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయంలో, దత్తాత్రేయ స్వామి ఆలయాలలో ప్రత్యేక పూజలో పాల్గొన్న సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్. వారితోపాటు సంగారెడ్డి పట్టణ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో గురువులకు ప్రత్యేక స్థానం ఉన్నదన్నారు. గురువులను ప్రతి ఒక్కరు బాధ్యతగా గౌరవించాలన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మికత పెంపొందించాలన్నారు. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల పైన ,మెదక్ జిల్లా మరియు తెలంగాణ ప్రజల పైన భగవంతుడి ఆశీస్సులు కృప ఎల్లకాలం తోడై ఉండాలని, అందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండేవిధంగా భగవంతుడు దీవించాలని కోరినారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తో పాటు స్థానిక ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. లాడే మనిలా మల్లేశం యాదవ్, ఎస్ విజయేందర్ రెడ్డి మాజీ సి డి సి చైర్మన్, కాసాలా బుచ్చిరెడ్డి మాజీ సిడిసి చైర్మన్, మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, కొండాపూర్ మండల పార్టీ అధ్యక్షులు ఎం విటల్, ప్రధాన కార్యదర్శి పి గోవర్ధన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, లాడే మల్లేశం, లాడే బాలు యాదవ్ , ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, నాయకులు కార్యకర్తలు పలువురు పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.