గాంధీ చూపిన శాంతి, అహింస మార్గంలోనే సమసమాజ స్థాపన సాధ్యం: వివేకానంద్

తెలుగు జ్యోతి న్యూస్ కుత్బుల్లాపూర్, అక్టోబర్ 2: మహాత్మా గాంధీ చూపిన శాంతి, అహింస మార్గాలను ప్రతి ఒక్కరూ అనుసరించినప్పుడే సమసమాజ స్థాపన సాధ్యమవుతుందని బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ అన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని 127-రంగారెడ్డి నగర్ డివిజన్‌లోని గాంధీనగర్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గాంధీజీ దేశానికి అందించిన సత్యం, శాంతి, అహింస సిద్ధాంతాలు...