TELUGU JYOTHI
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 8:49 am Posted by : TELUGU JYOTHI DESK

హైదరాబాద్ (శ్రీనగర్ కాలనీ)లో అలరించనున్న రాంబో సర్కస్ – ఇంటర్నేషనల్ సర్కస్ ఫెస్టివల్ ఇండియా*

తెలుగుజ్యోతి. హైదరాబాద్ :

హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో రాంబో సర్కస్ ఆధ్వర్యంలో “ఇంటర్నేషనల్ సర్కస్ ఫెస్టివల్ ఇండియా” ప్రేక్షకులను అలరించనుంది.

చిన్నారులు, కుటుంబాలను ఆకట్టుకునేలా ప్రత్యేక విన్యాసాలు, వినోద కార్యక్రమాలతో సర్కస్ ను ప్రత్యేకంగా రూపొందించారు.

దేశ, విదేశాలకు చెందిన కళాకారులు ఉత్కంఠభరితమైన సాహస విన్యాసాలు, బ్యాలెన్సింగ్ షోలు, హాస్య ప్రదర్శనలు, ఆకట్టుకునే కళా ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఉత్కంఠకు గురిచేసే విన్యాసాలతో పాటు పిల్లలను అలరించే ప్రత్యేక కార్యక్రమాలు సర్కస్ లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపేలా సురక్షితమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

నగరవాసులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించేందుకు రాంబో సర్కస్ సిద్ధంగా ఉంది. పిల్లలు, యువత, పెద్దలు అందరూ ఈ సర్కస్ ఫెస్టివల్ ను సందర్శించి ఆస్వాదించాలని నిర్వాహకులు ఆహ్వానించారు.