TELUGU JYOTHI
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 12:33 pm Posted by : TELUGU JYOTHI DESK

టిడిపి మహిళ ఇంటి వద్ద నిజం గెలిచింది” అనే కార్యక్రమం

టిడిపి మహిళా నాయకులు “ఎన్ని శ్రీదేవి”

తెలుగు జ్యోతి న్యూస్ ఆమదాలవలస నియోజకవర్గం :

దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కక్షతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేసి 53 రోజులు జైలులో నిర్బంధించి నేటికి మూడు సంవత్సరములు పూర్తయిన సందర్భంగా నిరసన తెలియజేస్తూ నియోజకవర్గం టిడిపి కార్యాలయం ఆదేశాల మేరకు టిడిపి మహిళా నాయకులు ఎన్ని శ్రీదేవి వాళ్ళ ఇంటి వద్ద 53 కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలియజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  45 ఏళ్ళ రాజకీయ అనుభవంలో ఎటువంటి మచ్చ లేని,తెలుగు రాష్ట్రాలను అన్ని రంగాలలో అగ్రశ్రేణిలో నిలిపిన   ముఖ్యమంత్రి చంద్రబాబుపై వై.యస్ జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు ధోరణితో జైలుకు పంపినా అసత్యం ఎక్కువ రోజులు నిలబడలేక పోయిందని అన్నారు.తమ నాయకుడి పై వచ్చిన అసత్య ఆరోపణలపై స్పందించిన తెలుగుదేశం కార్యకర్తలతో పాటు తిరగబడిన ప్రజల ఆగ్రహంతో 2024 ఎన్నికల్లో వైసీపీని భూస్థాపితం చేసినా వారికి బుద్ధి రాలేదని, డీఎస్సీపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కక్షపూరిత రాజకీయాలకు పాల్పడితే ఎలాంటి గుణపాఠం లభిస్తుందో తెలియజెప్పడానికే తెలుగుదేశం పార్టీ నేడు “నిజం గెలిచింది” అనే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని వివరించారు. కక్షపూరిత రాజకీయాల కన్నా ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు అనే నినాదంతో రాష్ట్రాన్ని దేశంలోనే అన్ని రంగాలలో ముందుకు తీసుకెళుతున్న నారా చంద్రబాబు నాయుడు దార్శనికత ఆదర్శప్రాయమని కొనియాడారు.వైసిపి అబద్ధాల యూనివర్సి టీలో ఫేక్  ప్రచారాలకు తెరదించి ఇకనైనా ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడితే ప్రజలు క్షమిస్తారని, లేదంటే వైసీపీ ని ప్రజలు నామరూపాలు లేకుండా చేస్తారని ఆమె హెచ్చరించారు.