Tuesday, July 28, 2026
Homeతెలంగాణమోదీ పాలనలో ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు

మోదీ పాలనలో ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు

📰 Generate e-Paper Clip

మోదీ పాలనలో ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు

ప్రముఖ వైద్యులు, జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్

తెలుగు జ్యోతి న్యూస్ శ్రీకాకుళం:

గత 12 సంవత్సరాలలో దేశ ఆరోగ్య రంగంలో అపూర్వమైన మార్పులు చోటుచేసుకున్నాయని ప్రముఖ వైద్యులు, జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగర పరిధిలో గురజాడ గాయత్రీ కళాశాలలో దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రజాసంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో నిర్వహించిన “12 సంవత్సరాల విశ్వాసం – అభివృద్ధి – ప్రజాసంక్షేమం” విశిష్ట వ్యక్తుల సమావేశం ఘనంగా జరిగింది. సాధారణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందన్నారు. ప్రత్యేకంగా ఆయుష్మాన్ భారత్ – ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన ద్వారా కోట్లాది పేద కుటుంబాలకు ఉచిత వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చికిత్సకు దూరమవుతున్న కుటుంబాలకు ఈ పథకం వరంలా మారిందన్నారు.అలాగే దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు (హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లు) గ్రామీణ ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలను మరింత చేరువ చేశాయని పేర్కొన్నారు. జన ఔషధి కేంద్రాల ద్వారా తక్కువ ధరలకు నాణ్యమైన మందులు అందుబాటులోకి రావడం వల్ల సాధారణ ప్రజల వైద్య ఖర్చులు గణనీయంగా తగ్గాయని వివరించారు.కోవిడ్-19 మహమ్మారి సమయంలో భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని, దేశీయంగా వ్యాక్సిన్ల తయారీ, ఉచిత టీకాల పంపిణీ, డిజిటల్ ఆరోగ్య వ్యవస్థల అభివృద్ధి వంటి చర్యలు ప్రజల ప్రాణాలను కాపాడాయని డాక్టర్ శ్రీధర్ కొనియాడారు. మహిళలు, పిల్లల ఆరోగ్య పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పోషణ అభియాన్, ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన, మిషన్ ఇంద్రధనుష్ వంటి కార్యక్రమాలు విశేష ఫలితాలు సాధించాయని చెప్పారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని వివరించారు.దేశ అభివృద్ధి కేవలం మౌలిక వసతుల నిర్మాణంతో కాకుండా ప్రజల ఆరోగ్యం, విద్య, సంక్షేమం బలోపేతం కావడం ద్వారా సాధ్యమవుతుందని ప్రధాని మోదీ నిరూపించారని ఆయన అన్నారు. ఆరోగ్యవంతమైన భారతదేశ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు మరింత మేలు చేస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే NER , బీజేపీ నేతలు సిరిపురం తేజేశ్వరరావు వేణుగోపాలరావు, ప్రముఖ వైద్యులు,సామాజిక కార్యకర్తలు ,విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!