శ్రీ నల్ల పోచమ్మ ఆలయంలో ఘనంగా గణేష్ అన్నదానం
తెలుగు జ్యోతి హైదరాబాద్, సెప్టెంబర్ 17:

దేవరకొండ బస్తీ రోడ్ నంబర్ 5లోని శ్రీ శ్రీ నల్ల పోచమ్మ దేవాలయంలో కొలువైన శ్రీ గణేష్ మహరాజ్ సన్నిధిలో గురువారం ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ అన్నదాన కార్యక్రమానికి రాజరాజేశ్వరి నాగరాజు దాతగా వ్యవహరించగా, పలువురు దాతలు తమ వంతు సహకారం అందించారు. కార్యక్రమం సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
కార్యక్రమానికి అరుంధతి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ కోర్ కమిటీ సభ్యులు ఆర్. మల్లేష్ యాదవ్, ఇంద్రపల్లి రవి, దూరపల్లి సురేష్ మాదిగ, దూరపల్లి రాజేష్, నందు స్వామి, బి. అంజమ్మ, ఏ. సుశీల, ఎం. రాములమ్మ, చంద్రపల్లి సునీత తదితరులు హాజరయ్యారు. చిన్నారులు కార్తీక్, అభి, ప్రతీక్, సిద్దు, గణేష్ తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
బంజారాహిల్స్ కాంగ్రెస్ నాయకుడు రాములు చౌహాన్ కార్యక్రమానికి ప్రెసిడెంట్‌గా, ముఖ్య అతిథిగా హాజరై భక్తులకు అన్నప్రసాదాన్ని స్వయంగా వడ్డించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్నదానం అత్యంత గొప్ప సేవా కార్యక్రమమని పేర్కొన్నారు. కార్యక్రమానికి దాతగా ముందుకు వచ్చిన రాజరాజేశ్వరి నాగరాజుకు, సహకరించిన దాతలకు, ముఖ్య అతిథులకు, భక్తులకు, చిన్నారులకు కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తి భావనతో పాటు సమాజంలో సేవా స్ఫూర్తిని పెంపొందిస్తాయని రాములు చౌహాన్ అన్నారు. శ్రీ గణేష్ మహరాజ్ ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు.

