
తెలుగుజ్యోతి
మహేశ్వరం
మహేశ్వరం నియోజకవర్గం మీర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో గణనాథుని తొలి రోజు పూజా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో గణపతిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మీర్‌పేట్ విశ్వకర్మ సంఘం అధ్యక్షులు ప్రభాకర చారితో పాటు సంఘం సభ్యులందరూ పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు గణనాథుని సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు ప్రభాకర చారి మాట్లాడుతూ.. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో సంఘ సభ్యులు, వారి కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. గణేష్ ఉత్సవాలను సంఘ సభ్యులందరి సహకారంతో ఐకమత్యంగా, భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.

