Friday, September 18, 2026
Homeఎడిటోరియల్మాదిరెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా చల్లా నరసింహారెడ్డి జన్మదిన వేడుకలు

మాదిరెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా చల్లా నరసింహారెడ్డి జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

తెలుగుజ్యోతి
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 14:

తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి జన్మదిన వేడుకలను హైదర్‌నగర్ డివిజన్‌లో ఘనంగా నిర్వహించారు.

శేరిలింగంపల్లి టీపీసీసీ లేబర్ సెల్ అధ్యక్షుడు మాదిరెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, లేబర్ సెల్ ప్రతినిధులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓల్డ్ హైదర్‌నగర్‌లోని ఐఎన్‌టీయూసీ కార్యాలయంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వి. జగదీశ్వర్ గౌడ్, ఐఎన్‌టీయూసీ లేబర్ సెల్ ఉపాధ్యక్షుడు నల్ల సంజీవరెడ్డి తదితరులు కేక్ కట్ చేసి చల్లా నరసింహారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మాదిరెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. చల్లా నరసింహారెడ్డి మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో 124వ డివిజన్ టీపీసీసీ లేబర్ సెల్ అధ్యక్షుడు జి. రవి, 121వ డివిజన్ టీపీసీసీ లేబర్ సెల్ అధ్యక్షుడు ఇసారపు కృష్ణ, ప్రధాన కార్యదర్శి బండ శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పి. రవీందర్, శివచారి, మాణిక్యం తమ్మలి, అచ్చగారి రాజిరెడ్డి, మియాపూర్ టీపీసీసీ లేబర్ సెల్ అధ్యక్షుడు ఎస్. దయాకర్ రెడ్డి, శేరిమోహన్ రెడ్డి, హైదర్‌నగర్ డివిజన్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కట్ల శేఖర్ రెడ్డి, టీపీసీసీ లేబర్ సెల్ ఉపాధ్యక్షుడు సదానందం గౌడ్, హైదర్‌నగర్ టీపీసీసీ లేబర్ సెల్ అధ్యక్షుడు ఫయాజ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కావూరి ప్రసాద్, సాంబశివరావు, మూర్తి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!