
తెలుగుజ్యోతి, శేరిలింగంపల్లి సెప్టెంబర్ 2:
పల్స్ ఫార్మాస్యూటికల్స్ అధినేత కాట్రగడ్డ వేంకట రాంబాబు కి శుభాకాంక్షలు తెలిపిన ప్రసాద్స్ ఫౌండేషన్ చైర్మన్, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డి ఎస్ ఆర్ కె ప్రసాద్. నోటి ద్వారా తీసుకునే విటమిన్ డి 3 మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు ఉపయోగపడే నానో-క్వారియర్ సాంకేతికత ఆధారిత ఎన్ ట్రాఫ్ట్ విటమిన్ డి 3 ఔషధానికి తాజాగా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డి సి జి ఐ) ఆమోద ముద్ర వేసిన సందర్భంగా పల్స్ ఫార్మాస్యూటికల్స్ కంపెని అధినేత కాట్రగడ్డ వెంకట రాంబాబు ని మాదాపూర్ లోని వారి కార్యాలయంలో కలిసి వారికి సాంప్రదాయ శాలువా తో సత్కరించి వారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలిపిన శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రసాద్స్ ఫౌండేషన్ చైర్మన్ డి ఎస్ ఆర్ కె ప్రసాద్. అకుంఠిత దీక్షతో ఎంతో కృషి చేసి ఎంతో మందికి స్ఫూర్తిని నింపిన కాట్రగడ్డ వెంకట రాంబాబు ఇలాంటి ఎన్నో విజయాలను అందుకోవాలని, మరెంతో మందికి స్ఫూర్తి గా నిలవాలని డి ఎస్ ఆర్ కె ప్రసాద్ ఆకాంక్షించారు .

