
మియాపూర్ తెలుగు జ్యోతి సెప్టెంబర్ 3.
శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ పరిధిలోని
స్టాలిన్ నగర్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మన్నేగూడ ఎల్లయ్య స్టాలిన్ నగర్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సమయంలో పదవీవిరమణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎల్లయ్య సార్ ను పలు పార్టీల కి చెందిన నాయకులు, పౌర సమాజం సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఎన్ . ప్రభాకర్ గౌడ్, సాయి గౌడ్, ప్రదీప్, టి. డేవిడ్, చంద్ర శేఖర్, ఎం ఈ వో వెంకటయ్య, వనం సుధాకర్, శ్రీనివాస్ తదితరులు శాలువాలతో సత్కరించారు. విశ్రాంత జీవితం ఆనందకరంగా సాగాలని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమం లో స్కూల్ స్టాఫ్, విద్యార్థులు పాల్గొన్నారు.

