Friday, September 18, 2026
Homeఎడిటోరియల్వినాయక చవితి ఉత్సవాలు తో విద్య కు ప్రాదాన్యత

వినాయక చవితి ఉత్సవాలు తో విద్య కు ప్రాదాన్యత

📰 Generate e-Paper Clip

 

తెలుగు జ్యోతి న్యూస్ ఆమదాలవలస నియోజకవర్గం :

 

వినాయక మండపం లో విద్య కు ప్రాధాన్యత ఇచ్చిన తిమ్మాపురం గ్రామం బి పి వై యూత్ ఆధ్వర్యంలో ఈరోజు వినాయక మండపం లో క్విజ్ కంపిటేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టూ ప్రక్కన ఉన్న గ్రామ విద్యార్థులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు. ఇదే గ్రామం లో సుమారు 22 ఏళ్ళు గా దసరా ఉత్సవాలలో క్విజ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అదే ఉత్సాహం తో(బి పి వై) యువత ఆలోచనకు దసరా ఉత్సవాలకు 22 ఏళ్ళ గా దాత గా వ్యవహరిస్తున్న స్వర్గీయ శ్రీ బొడ్డేపల్లి వైకుంఠ రావు మాస్టారు కుమారుడు బొడ్డేపల్లి రవికుమార్ సహకారం తో గత 2 ఏళ్ళు గా వినాయక మండపం వద్ద క్విజ్ నిర్వహించడం జరుగుతుంది ఈ ఏడాది విశేషమైన స్పందన వచ్చిందని పిల్లల్లో విద్య పై మక్కువను చూసి ఎంతటి ప్రతి కూల వాతావరణం ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని ఈ క్విజ్ నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతీ యేటా ఈ కార్యక్రమం నిర్వహణకు ముందుకు వచ్చిన దాతకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.అదేవిదంగా ఈ క్విజ్ తో పాటుగా ఎస్సయ్ రైటింగ్,ఎలక్ట్యూషన్ పోటీలు కూడా ఏర్పాటు చేసామని ఈ essay రైటింగ్ కార్యక్రమానికి నిర్వహణ కు ముందుకు వచ్చిన దాత పేడాడ రాజశేఖర్ మాస్టారు కి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు అదేవిదంగా ఎలక్ట్యూషన్ కార్యక్రమానికి దాత బమ్మిడి తవుడు కుటుంబ సభ్యులు కు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!