కుత్బుల్లాపూర్, అక్టోబర్ 2 (తెలుగు జ్యోతి న్యూస్):
జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ముఖ్యంగా జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా క్యాష్‌లెస్ హెల్త్ కార్డుల సౌకర్యాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టియుడబ్ల్యూజే (టీయూజే) హెచ్-143 యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం కుత్బుల్లాపూర్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
షాపూర్ నగర్‌లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జర్నలిస్టులు, అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం షాపూర్ నగర్ ప్రధాన పోస్టాఫీస్ కార్యాలయం వద్ద పోస్ట్‌కార్డుల ద్వారా ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు.
ఈ సందర్భంగా ఐజేయూ రాష్ట్ర సభ్యులు రంగు వెంకటేష్ గౌడ్, యూనియన్ జిల్లా అధ్యక్షులు కోల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా జర్నలిస్టుల సమస్యల పరిష్కారంపై తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. జర్నలిస్టుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఉద్యోగులకు అందుతున్న తరహాలో జర్నలిస్టులకు కూడా క్యాష్‌లెస్ హెల్త్ కార్డుల సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు.
జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని, పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు శివాజీ, కుత్బుల్లాపూర్ టియుడబ్ల్యూజే హెచ్-143 అధ్యక్షులు సుగ్రీవుడు ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి మాధవ రెడ్డి, కోశాధికారి ఎర్రోళ్ల బాబు, టెంజు అధ్యక్షులు ఎర్రోళ్ల కృష్ణ, కుత్బుల్లాపూర్ ఉపాధ్యక్షులు బాన్సువాడ వెంకటేష్, జుట్టు సాయిలు, కార్యదర్శులు ప్రసాద్, యేర్రం శ్రీనివాస్ గుప్తా, జుట్టు యాకుబ్, పల్నాటి శివకుమార్, పాండురంగం, సభ్యులు కామేశ్వర్, శ్రీరామ రాజు, ఎన్. శివకుమార్, సూర్యచంద్ర, ప్రసాద్, మహేష్, మణి ప్రసాద్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.

