Sunday, October 4, 2026
Homeఎడిటోరియల్పంట పొలాల్లో ముంపు.... రైతుల వద్దకు మార్కెఫెడ్ డైరెక్టర్

పంట పొలాల్లో ముంపు…. రైతుల వద్దకు మార్కెఫెడ్ డైరెక్టర్

📰 Generate e-Paper Clip

  1. తుఫాన్ తాకిడితో పంట నష్టం.. క్షేత్రస్థాయిలో పరిశీలన

ముంపు పంటలపై పరిశీలన.. రైతులకు అండగా కూటమి ప్రభుత్వం..

నీట మునిగిన పంటలు….రైతులకు రామకృష్ణ నాయుడు భరోసా

లక్కుపురం, పెద్దపేట, సింగన్నపాలెం గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ మార్క్ ఫెడ్ డైరెక్టర్ పర్యటన..

తెలుగు జ్యోతి న్యూస్ – బూర్జ మండలం:

ఇటీవల తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా బూర్జ మండలంలోని పలు గ్రామాల్లో ముంపునకు గురైన పంట పొలాలను ఏపీ మార్కెఫెడ్ డైరెక్టర్ రామకృష్ణ నాయుడు మంగళవారం పరిశీలించారు. లక్కుపురం, పెద్దపేట, సింగన్నపాలెం, ఓవీపేట, మదనాపురం గ్రామాల్లో పర్యటించిన ఆయన ముంపు పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి రైతులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా పొలాల్లో నిలిచిన నీరు, పంటల పరిస్థితి, సాగు చేసిన పంట రకాలు తదితర వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. వర్షాలు, ముంపు కారణంగా ఎదురైన ఇబ్బందులను రైతులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పంట నష్టాన్ని సంబంధిత అధికారులు పరిశీలించి నమోదు చేస్తున్నారని, ప్రభుత్వానికి నష్ట వివరాలు చేరేలా చర్యలు తీసుకుంటామని రామకృష్ణ నాయుడు తెలిపారు.
ముంపు కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వ పరంగా అందే సహాయంపై చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకునేలా చర్యలు ఉంటాయని భరోసా కల్పించారు.
పర్యటనలో స్థానిక రైతులు, గ్రామస్థులు పాల్గొని తమ సమస్యలను ఆయనకు వివరించారు. పంట నష్టం వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేయాలని రైతులు కోరారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!