

తెలుగు జ్యోతి న్యూస్ కుత్బుల్లాపూర్, అక్టోబర్ 2:
మహాత్మా గాంధీ చూపిన శాంతి, అహింస మార్గాలను ప్రతి ఒక్కరూ అనుసరించినప్పుడే సమసమాజ స్థాపన సాధ్యమవుతుందని బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ అన్నారు.
మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని 127-రంగారెడ్డి నగర్ డివిజన్లోని గాంధీనగర్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గాంధీజీ దేశానికి అందించిన సత్యం, శాంతి, అహింస సిద్ధాంతాలు నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. సమాజంలో శాంతి, సామరస్యం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ గాంధీ చూపిన మార్గాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. శాంతి, అహింస అనే ఆయుధాలతోనే సమసమాజ స్థాపన సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ విజయ్ శేఖర్ గౌడ్, జగన్, మంత్రి సత్యనారాయణ, సురేష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు ఎర్వ శంకరయ్య, నాయకులు జల్దా లక్ష్మీనాథ్, ఎల్లయ్య, అబ్దుల్ ఖాదర్, బాలయ్య, రాములు, శ్రీనివాస్, సత్యనారాయణ, రాజిరెడ్డి, నీలగిరి తిమ్మయ్య, నవీన్, బిర్జు సింగ్, విజయ్, మల్లీశ్వరి, పద్మ, కమలా బాయి, యాదిరెడ్డి, కార్తీక్, బాలు నేత, ఎర్వ సాయి కిరణ్ (బంటి), సతీష్ గట్టోజి, గౌస్, అంజన్న, అల్లూ, సోను తదితరులు పాల్గొన్నారు.

