Wednesday, August 5, 2026
Homeఎడిటోరియల్అమ్మవారి ఆలయ నిర్మాణం, తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో కాలనీ ప్రతినిధుల భేటీ

అమ్మవారి ఆలయ నిర్మాణం, తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో కాలనీ ప్రతినిధుల భేటీ

📰 Generate e-Paper Clip

తెలుగుజ్యోతి,శేరిలింగంపల్లి ఆగస్టు 3:

కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యతో పాటు అమ్మవారి ఆలయ నిర్మాణానికి సంబంధించిన అంశాలపై గౌరవ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే, పిఎసి చైర్మన్ అరికెపూడి గాంధీని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బలరామ్ యాదవ్ ఆధ్వర్యంలో కాలనీ పెద్దలు, యువకులు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.

ప్రజల సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వెంటనే వాటర్ వర్క్స్ మేనేజర్ సందీప్‌తో ఫోన్‌లో మాట్లాడి, ప్రతిరోజూ ఉదయం వేళల్లో నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం ఉన్న సమయాన్ని మరింత పెంచే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు.

అమ్మవారి ఆలయ నిర్మాణం విషయాన్ని కూడా ఎమ్మెల్యే సానుకూలంగా స్వీకరించి, దీనిపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అన్ని వర్గాలతో చర్చించి ముందుకు వెళ్లాలని సూచించారు.

ఈ సమావేశానికి కాలనీకి చెందిన పెద్దలు, యువకులు అధిక సంఖ్యలో హాజరై తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమానికి హాజరై సహకరించిన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బలరామ్ యాదవ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!