Wednesday, July 29, 2026
Homeఎడిటోరియల్పటాన్ చెరులో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను వెంటనే ప్రారంభించాలి... సంతకాల సేకరణ ప్రారంభించిన...

పటాన్ చెరులో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను వెంటనే ప్రారంభించాలి… సంతకాల సేకరణ ప్రారంభించిన సీపీఎం నేత కే రాజయ్య.. రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర విడనాడాలి ప్రజల ప్రాణాలను పాడాలి… జాతీయ రహదారిపై రోజు ప్రమాదాలే..

📰 Generate e-Paper Clip

 

తెలుగు జ్యోతి జాతీయ దినపత్రిక 25 జూలై పటాన్ చెరు రిపోర్టర్.

పఠాన్ చెరు లో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను వెంటనే ప్రారంభించాలని నేడు పటాన్చెరులోని ఫ్రీడం పార్కు వద్ద సిపిఎం పార్టీ పటాన్చెరువు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ,కే రాజయ్య మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడైన పటాన్చెరులో 300 కోట్ల రూపాయలతో (సి ఎస్ ఆర్ నిధులతో )నిర్మించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేలాది పరిశ్రమలో ఉన్న పటాన్ చెరు ,పాశ మల్లారం పార్శిక వాడలో దాదాపు 2, లక్షల పైగా కార్మికుల సంఖ్య ఉన్నదని అన్నారు. అనునిత్యం ఇస్నాపూర్ పటాన్ చెరు ఇతర ప్రాంతాలకు ఎంతోమంది జాతీయ రహదారిపై ప్రయాణం చేస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.. వైద్య సదుపాయం కోసం చందానగర్, లేదా హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారని అన్నారు. జాతీయ రహదారి మీదుగా అనునిత్యం అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. కార్మికుల ప్రయోజనం కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వెంటనే ప్రారంభిస్తే అనేక ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు. గత సంవత్సరం పాషా మైలారం పారిశ్రామిక వాడలో (సిగాచి) పరిశ్రమలో ప్రమాదంలో 54 మంది కార్మికులు మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు. కానీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులో ఉంటే అనేక ప్రమాదాలను అరికట్టడానికి కార్మికుల ప్రాణాలను కాపాడడానికి, అవకాశం ఉండేదని అన్నారు. కార్మికుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని గత నాలుగు సంవత్సరాల క్రితం అప్పట్లో ఉన్న బి.ఆర్.ఎస్ ప్రభుత్వం హాస్పిటల్ నిర్మాణాన్ని ప్రారంభించింది అని గుర్తు చేశారు. సంవత్సరం పూర్తయిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభం చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పటాన్చెరు లో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన పటాన్చెరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజానీకాన్ని సమీకరించి ఆందోళనలను మరింత చేపడతామని హెచ్చరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి బి నాగేశ్వరరావు, సిపిఎం పార్టీ ఏరియా కమిటీ సభ్యులు పాండురంగారెడ్డి, సత్తిబాబు ప్రదీప్ ,నిరంజన్ ,శివరాజ్, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!