Friday, September 18, 2026
Homeఆంధ్రప్రదేశ్ఎమ్మెల్యే రవికుమార్ చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం.

ఎమ్మెల్యే రవికుమార్ చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం.

📰 Generate e-Paper Clip

టీడీపీ మహిళా నాయకులు ఎన్ని శ్రీదేవి

తెలుగు జ్యోతి న్యూస్ ఆమదాలవలస నియోజకవర్గం ఆగస్టు 18:

సోమవారం పారిశ్రామికవాడలోని ఎమ్మెల్యే కార్యాలయంలో టీడీపీ మహిళా నాయకులు, మున్సిపల్ ఉద్యోగులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ మహిళా నాయకులు ఎన్ని శ్రీదేవి మాట్లాడుతూ 2014-19 మధ్య టీడీపీ పాలనతో పాటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే రవికుమార్ మున్సిపల్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. 2014 నుంచి ఇప్పటివరకు మున్సిపాలిటీలోని 23 వార్డుల్లో విద్యుత్ స్తంభాలు వీధిలైట్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గత వైసిపి పాలనలో వీధిలైట్లు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు జరగక పట్టణంలోని పలు ప్రాంతాలు చీకట్లో ఉండేవని విమర్శించారు. గత టీడీపీ పాలనలో మొదటి వార్డు తిమ్మాపురం సమీపంలో 534 ఎన్టీఆర్ గృహాలను పేదల కోసం నిర్మించి ఉచితంగా అందించినట్లు తెలిపారు. ప్రస్తుత

కూటమి పాలనలో 23 వార్డుల్లో అధ్వానంగా ఉన్న రహదారులు డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు మంజూరు త చేయించి పనులు చేపట్టారని చెప్పారు. మున్సిపల్ అభివృద్ధికి ఎమ్మెల్యే రవికుమార్ చేస్తున్న కృషిని ఓర్వలేక వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ మహిళా నాయకులు విమర్శించారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటుతో తగిన సమాధానం చెబుతారని పేర్కొన్నారు., రెడ్డి గౌరీ, బి.జగదీశ్వరి, బోయిన. సునీత, పీవీకే రాజు తదితరులు టీడీపీ మహిళా నాయకులు ఎన్ని శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!