Thursday, September 17, 2026
Homeతెలంగాణఖమ్మంనెత్తురోడుతున్న రావినూతల వే-బ్రిడ్జ్.. వరుస ప్రమాదాలతో ప్రజల బెంబేలు

నెత్తురోడుతున్న రావినూతల వే-బ్రిడ్జ్.. వరుస ప్రమాదాలతో ప్రజల బెంబేలు

📰 Generate e-Paper Clip

అధికారుల నిర్లక్ష్యంపై నిరసనలు.. శాశ్వత భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికుల డిమాండ్!…

బోనకల్ ఖమ్మం జిల్లా ఆగస్టు 09 తెలుగు జ్యోతి ప్రతినిధి:

బోనకల్ మండల పరిధిలోని రావినూతల వే-బ్రిడ్జ్ వద్ద వరుస రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారి స్థానిక ప్రజలను, వాహనదారులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి.మృత్యుకూపంగా మారిన ఈ మార్గంలో భద్రతా ప్రమాణాలు పాటించడంలో అధికారులు తీవ్రంగా నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు

వెల్లువెత్తుతున్నాయి.సుబాబుల్ లోడు ట్రాక్టర్‌ను ఢీకొట్టిన కారు ఇద్దరికి తీవ్ర గాయాలు ​ఆదివారం రావినూతల వే-బ్రిడ్జ్ సమీపంలో మరొక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అమిత వేగంతో వచ్చిన ఒక కారు, సుబాబుల్ కలప లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.ఈ భయానక ప్రమాదంలో కారు ముందరి భాగం నుజ్జునుజ్జవగా,ట్రాక్టర్ కూడా తీవ్రంగా దెబ్బతింది.కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి,క్షతగాత్రులను బయటకు తీసి సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిద్దరూ కొణిజర్ల మండలానికి చెందిన గ్రామీణ వైద్యులు గా గుర్తించారు.​ఘటనా స్థలానికి పోలీసులు.. కేసు నమోదు ​ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే బోనకల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రవాణాకు అడ్డుగా ఉన్న వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, ఘటనపై కేసు నమోదు చేసుకుని పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం

​ఈ మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ రవాణా, పంచాయతీ రాజ్, పోలీసు అధికారులు కంటితుడుపు చర్యలతో సరిపెడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.వే-బ్రిడ్జ్ సమీపంలో వెంటనే స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి.​రాత్రి వేళల్లో వెలుగులు ఇచ్చే రేడియం సిగ్నల్స్, బ్లింకర్ లైట్లు అమర్చాలి.​మలుపుల వద్ద దారి స్పష్టంగా కనిపించేలా కేటాయ్స్ వేయాలి.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రావినూతల వే-బ్రిడ్జ్ వద్ద శాశ్వత ప్రాతిపదికన రహదారి భద్రతా చర్యలు చేపట్టి, అమాయకుల ప్రాణాలను కాపాడాలని స్థానిక ప్రజలు, ప్రయాణికులు తీవ్రంగా విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!