
- వికారాబాద్ జిల్లా బ్యూరో వి వెంకటేష్ చారి
తెలుగు జ్యోతి జులై 26:
వికారాబాద్ పట్టణానికి 10 కిలోమీటర్ల పరిధిలో ద్విచక్ర వాహనాలు మార్గమధ్యలో సాంకేతిక సమస్యలతో నిలిచిపోయిన సందర్భాల్లో వాహనదారులకు తక్షణమే సహాయం అందించేందుకు వినాయక సర్వీస్ సెంటర్ ప్రత్యేక ఆన్-రోడ్ మెకానిక్ సేవలను ప్రారంభించింది.
వాహనదారులు తమ వాహనం ఎక్కడ నిలిచిపోయినా,సర్వీస్ సెంటర్‌కు ఫోన్ చేయగానే మెకానిక్ సంఘటన స్థలానికి చేరుకుని అవసరమైన మరమ్మతులు నిర్వహిస్తారని వినాయక సర్వీస్ సెంటర్ ప్రొప్రైటర్ మహేందర్ తెలిపారు.వికారాబాద్ పరిసర ప్రాంతాల వాహనదారులు ఈ సేవలను వినియోగించుకుని ఇబ్బందులు లేకుండా తమ ప్రయాణాన్ని కొనసాగించాలని ఆయన కోరారు. అన్ని రకాల ద్విచక్ర వాహనాలకు సర్వీసింగ్, మరమ్మతులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.సంప్రదింపు ఫోన్ నంబర్ 9652567771

