Friday, September 18, 2026
Homeఎడిటోరియల్హైదర్ నగర్ లో మాదిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా చల్లా నరసింహారెడ్డి జన్మదిన వేడుకలు..

హైదర్ నగర్ లో మాదిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా చల్లా నరసింహారెడ్డి జన్మదిన వేడుకలు..

📰 Generate e-Paper Clip

Oplus_131072

శేరిలింగంపల్లి అక్షిత ప్రతినిధి..

తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, రంగారెడ్డి జిల్లా డి సి సి ప్రెసిడెంట్ చల్లా నర్సింహారెడ్డి జన్మదిన సందర్భంగా హైదర్ నగర్ డివిజన్‌ లో శేరిలింగంపల్లి టిపిసిసి లేబర్ సెల్ అధ్యక్షులు మాదిరెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, లేబర్ సెల్ ప్రతినిధుల, కార్యకర్తల ఆధ్వర్యంలో చల్లా నరసింహారెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథులు గా టిపిసిసి జనరల్ సెక్రటరీ వి.జగదీశ్వర్ గౌడ్, ఐఎన్ టి యు సి లేబర్ సెల్ వైస్ ప్రెసిడెంట్ నల్ల సంజీవరెడ్డి లు రామ్ నరేష్ ఓల్డ్ హైదర్ నగర్ లోని ఐ ఎన్ టి యు సి కార్యాలయంలో కేక్ కట్ చేసారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పాల్గొని నరసింహారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు టీపీసీసీ లేబర్ సెల్ శేరిలింగంపల్లి అధ్యక్షులు మాదిరెడ్డి మోహన్ రెడ్డి పలువురు నాయకులు, హైదర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ నాయకులతో కలిసి నరసింహారెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 124 డివిజన్ టీపీసీసీ లేబర్ సెల్ అధ్యక్షుడు జి. రవి, 121డివిజన్ టీపీసీసీ లేబర్ సెల్ ప్రెసిడెంట్ ఇసారపు కృష్ణ, 121 డివిజన్ టీపీసీసీ లేబర్ సెల్ జనరల్ సెక్రటరీ బండ శ్రీకాంత్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పి.రవీందర్, శివచారి, మాణిక్యం తమ్మలి, అచ్చగారి రాజిరెడ్డి, మియాపూర్ టీపీసీసీ లేబర్ సెల్ అధ్యక్షుడు ఎస్. దయాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శేరిమోహన్ రెడ్డి, టి పి సి సి హైదర్ నగర్ డివిజన్ జనరల్ సెక్రటరీ అశోక్, డి సి సి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ల శేఖర్ రెడ్డి, టిపిసిసి లేబర్ సెల్ వైస్ ప్రెసిడెంట్ సదానందం గౌడ్, హైదర్ నగర్ టిపిసిసి లేబర్ సెల్ ప్రెసిడెంట్ ఫయాజ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కావూరి ప్రసాద్, సాంబశివ రావు, మూర్తి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!