స్థానిక ఎమ్మెల్యే “కూన రవికుమార్ “ఆధ్వర్యంలో

తెలుగు జ్యోతి న్యూస్ ఆమదాలవలస నియోజకవర్గం:
వైసిపి ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన… మూడేళ్లు పూర్తయిన సందర్భంగా…
నిజం గెలిచింది… కార్యక్రమాన్ని పార్టీ పిలుపుమేరకు టిడిపి శ్రేణులు నియోజకవర్గ టిడిపి కార్యాలయం వద్ద నిర్వహించారు. అనంతరం నూక రాజు మాట్లాడుతూ2023 సెప్టెంబర్ 9న టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేసి 53 రోజుల పాటు జైలులో ఉంచారని ఆరోపించారు. ఆ చీకటి రోజులకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ ఆదేశాల మేరకు కుటుంబ సభ్యులతో కలిసి ‘నిజం గెలిచింది’ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.ఎటువంటి తప్పు చేయని జాతీయ స్థాయి నాయకుడైన చంద్రబాబుపై బురదజల్లి, కుట్రపూరితంగా వ్యవహరించినప్పటికీ అంతిమంగా న్యాయస్థానాల్లో సత్యమే గెలిచిందని అన్నారు. కక్షసాధింపు రాజకీయాలు ఓడిపోయాయని పేర్కొన్నారు.గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అనేక అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేశారని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు నూకరాజు, నారాయణపురం ప్రాజెక్టు మాజీ చైర్మన్ తమ్మినేని అమర్నాథ్, మాజీ కౌన్సిలర్ ఇందిరాపు విశ్వనాథం, ఎమ్మెల్యే సహాయకులు పివికే రాజు, కార్యాలయ సహాయకులు మనోజ్, శ్రీనివాసరావు, ప్రసాదరావు, దీనిబందు, యోగేశ్వరరావు, తదితరులు ఉన్నారు.

