Tuesday, July 28, 2026
Homeతెలంగాణగాంధీ భవన్ లో ఘనంగా వై ఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు

గాంధీ భవన్ లో ఘనంగా వై ఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

గాంధీ భవన్ లో ఘనంగా వై ఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకల..

తెలుగుజ్యోతి, శేరిలింగంపల్లి జులై 8:

ప్రజా సేవే పరమావధిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం ప్రజాసేవకు అంకితమైన ఆదర్శప్రాయమైన ప్రయాణం అని అన్నారు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు,టియుఐఎఫ్ డిసి ఛైర్మన్ చల్లా నర్సింహా రెడ్డి అన్నారు.

బుధ వారం రోజు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చల్లా నర్సింహా రెడ్డి , ఐఎన్టీయుసి రాష్ట్ర నాయకులు,టిపీసీసి లేబర్ సెల్ వైస్ చైర్మన్ నల్ల సంజీవ రెడ్డి,టిపిసిసి రాష్ట్ర లేబర్ సెల్ ఆర్గనైజింగ్ కార్యదర్శులు వీరమల్ల వీరేందర్ గౌడ్ , వుయ్యూరు శ్రీదేవి ,రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి శేరి అంతి రెడ్డి , రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ముద్దంగుల తిరుపతి , కాంగ్రెస్ పార్టీ నాయకులు మోహన్ రెడ్డి , మోహన్ రావు పటేల్ ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి పాల్గొని రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

వైఎస్ఆర్ అధికారాన్ని హోదాగా కాకుండా,ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఒక సాధనంగా ఆయన భావించారు అని,రైతు,పేద,కార్మికుడు,విద్యార్థి,మహిళ,వృద్ధుడుసమాజంలోని ప్రతి వర్గం సంక్షేమమే ఆయన పాలనకు కేంద్రబిందువుగా నిలిచిందని అన్నారు..

ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకోవాలనే సంకల్పంతో గ్రామాలు తిరిగి,వారి సమస్యలను ప్రత్యక్షంగా వినడం ఆయన నాయకత్వంలోని విశిష్ట లక్షణం అని,సంక్షేమ పథకాల ద్వారా సామాన్య ప్రజల జీవితాల్లో ఆశాజ్యోతిని నింపి,ప్రభుత్వం ప్రజలకు చేరువ కావాలనే భావనను కార్యరూపంలో చూపించారని అన్నారు..ప్రజల ఆశీర్వాదం కంటే గొప్ప పురస్కారం లేదు అనే తత్వాన్ని ఆచరణలో చూపిన నాయకుడు వైఎస్ఆర్ ,ఆయన ప్రజా సేవ,మానవతా దృక్పథం,పేదల పట్ల ఉన్న అంకితభావం నేటికీ ఎందరో ప్రజాప్రతినిధులకు,యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని అన్నారు..

ప్రజల కోసం జీవించడం,ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయడం,సమాజ అభ్యున్నతినే నిజమైన విజయంగా భావించడంఇవే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజా సేవ యొక్క అసలైన సారాంశం అని అన్నారు..ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అన్ని అనుబంధ సంఘాల నాయకులు నాయకురాళ్ళు తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!