
తెలుగు జ్యోతి దినపత్రిక ఆగస్టు 7 జిల్లా ప్రతినిధి, డీ ప్రేమ్.
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం చర్ల గోపులారం గ్రామానికి చెందిన అమరావతి రుక్మయ్య ముదిరాజ్ మాజీ ఉపసర్పంచ్ సీనియర్ నాయకులు వారి జన్మదిన సందర్భంగా ఈరోజు వారి నివాసంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ జన్మదిన వేడుకలకు డాక్టర్ డీ ప్రేమానందం రాష్ట్ర నాయకులు ఉమ్మడి మెదక్ జిల్లా అట్రాసిటీ విజిల్స్ కమిషన్ మాజీ డైరెక్టర్ హాజరై పాల్గొన్నారు. చర్ల గోపులారం సర్పంచ్ జీ మహేశ్వరి సతీష్, ఉపసర్పంచ్ జి పున్నెమ్మ రాములు యాదవ్, పంచాయతీ సభ్యులు, జి నవీన్, ఏ రవి, ఎం వీరమణి కిష్టయ్య, జి లక్ష్మయ్య మాజీ పంచాయతీ సభ్యులు, జి వంశీ శ్రీధర్ ముదిరాజ్ బీసీ సంక్షేమ సంఘం యువ నాయకులు, ఏ శ్రీకాంత్ ముదిరాజ్, పి బాల్ రాజ్ గౌడ్ నాయకులు, తదితరులు పాల్గొని ఏ రుక్మయ్య ముదిరాజ్ మాజీ ఉపసర్పంచ్ కి శాలువాలతో సత్కరించి , కేక్ కట్ చేయించి స్వీట్లు తినిపించిన తరువాత శుభాకాంక్షలు తెలియజేసినారు.
వారు మాట్లాడుతూ ఏ రుక్మయ్యకు భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని, ఇలాంటి జన్మదిన వేడుకలు సంతోషంగా ఎన్నెన్నో జరుపుకునే విధంగా భగవంతుడు ఆశీర్వదించి దీవించాలని కోరినారు.
ఏ రుక్మయ్య సీనియర్ నాయకులు వారు మాట్లాడుతూ చర్ల గోపులారం నాయకులు, మా నివాసానికి వచ్చి మాకు శాలువాలతో సత్కరించి కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించినందుకు వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు.

